Homeటాప్ స్టోరీస్అభిమాని చనిపోవడంతో విలపించిన హీరో

అభిమాని చనిపోవడంతో విలపించిన హీరో

hero sudeep shocked with hardcore fan diedతనని ఎంతగానో అభిమానించే అభిమాని కేన్సర్ తో బాధపడుతూ కన్ను మూయడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ . బెంగుళూర్ కి చెందిన వినూత అనే యువతి సుదీప్ కి వీరాభిమాని , అయితే గతకొంత కాలంగా వినూత క్యాన్సర్ తో బాధపడుతోంది . తన అభిమాన హీరో సుదీప్ ని చూడకుండానే చనిపోతానా అని తెగ బాధపడిందట ! ఈ విషయం సుదీప్ అభిమానులకు తెలియడంతో ఈ విషయాన్నీ సుదీప్ కు తెలిపారు .

 

- Advertisement -

విషయం తెలిసిన వెంటనే వినూత ని తన ఇంటికి పిలిపించుకొని ఆమె కు ధైర్యం చెప్పాడు .  సెల్ఫీ కూడా దిగాడు,తన అభిమాన హీరోని కలిసిన ఆనందంలో పరవశించిపోయింది వినూత .  అయితే కేన్సర్ మరింతగా ముదరడంతో మంగళవారం రాత్రి చనిపోయింది . తన అభిమాని చనిపోయిన విషయం తెలుసుకున్న కిచ్చా సుదీప్ విలపించాడు అంతేకాదు ఆమెతో కలిసి దిగిన ఫోటో ని ట్వీట్ చేసి నివాళులర్పించాడు సుదీప్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts