Homeటాప్ స్టోరీస్ఆసక్తికరమైన ట్వీట్ చేసిన రామ్

ఆసక్తికరమైన ట్వీట్ చేసిన రామ్

హీరో రామ్ ఆసక్తికరమైన ట్వీట్ చేసి అందరినీ అలరిస్తున్నాడు . తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ రిజల్ట్ విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసింది . దాంతో 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు . ఈ సంఘటన హీరో రామ్ ని తీవ్రంగా కలిచివేసింది అందుకే ” ఇంటర్ పూర్తికాని సచిన్ టెండూల్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసాడు . అంతేకాదు నేను కూడా ఇంటర్ పూర్తిచేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు హీరో రామ్ .

- Advertisement -

అంటే రామ్ ఉద్దేశ్యం ఏంటంటే ……. చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాలను తృణ ప్రాయంగా వదిలేయడం తప్పు అంటూ ట్వీట్ చేసాడు . ఈరోజు సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు కావడంతో సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఇంతటి సంచలనం సృష్టించిన సచిన్ చదువు ఇంటర్ కూడా పూర్తికాలేదని అలాగే టెన్త్ కూడా ఒకేసారి పాస్ కాలేదని ఈ తరానికి అంతగా తెలియదు . అంతెందుకు ఇప్పుడున్న స్టార్ హీరోలలో చాలామంది టెన్త్ పాస్ కాలేదు అలాగే ఇంటర్ పూర్తి చేయని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు . అందుకే విలువైన జీవితాలను నాశనం చేసుకోకుండా ముందుకు సాగండి , పరీక్షలో ఫెయిల్ అయితే అక్కడే జీవితం ఆగిపోదు అంటూ హితువు చెబుతున్నాడు రామ్ . ఈ హీరో కూడా పాస్ అవలేదు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All