Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని

బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని

hero nani may host for bigg boss 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ వ్యాఖ్యానంతో బిగ్ బాస్ మరో లెవల్ కి వెళ్ళింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 రెడీ అవుతోంది . మొదటి సీజన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు కానీ రెండో సీజన్ లో మాత్రం ఎన్టీఆర్ చేసే ఆలోచన లేదు దాంతో అతడి స్థానంలో మరో హీరో ఎవరైతే బెటర్ అని ఆలోచించగా పలువురు హీరోల పేర్లు తెరమీదకు వచ్చాయి .

కట్ చేస్తే ….. అందులో నాని పేరు తాజాగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది . నాని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు అయితే షూటింగ్ చేస్తూనే మధ్యలో ఖాళీగా ఉన్న సమయాన్ని బిగ్ బాస్ కోసం వెచ్చించడానికి నిర్ణయించుకున్నాడట నాని . అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ నాని బిగ్ బాస్ 2 కి వ్యాఖ్యానం అందించడం ఖాయమట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All