Homeఎక్స్ క్లూసివ్హీరో నాని కారు యాక్సిడెంట్

హీరో నాని కారు యాక్సిడెంట్

హీరో నాని కారు యాక్సిడెంట్ జరిగింది , అయితే ఆ సమయంలో కారులో నాని ఉన్నాడా ? లేదా ? అన్నది మాత్రం తెలియడం లేదు . యాక్సిడెంట్ అతివేగం వల్ల జరిగింది దాంతో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అని చెబుతున్నారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 45 లో జరిగింది . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా ఈ కారు నాని తండ్రి గంటా రాంబాబు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది . 
 
ts 07fc 0024 నెంబర్ గల టయోటా ఇన్నోవా కారు మీద ఇంతకుముందే ఓవర్ స్పీడ్ కారణంతో 1400 చలానా విధించారు కాగా ఇంతవరకు కూడా ఆ జరిమానా  కట్టలేదు . ఈరోజు ఉదయం తెల్లవారు ఝామున ఈ సంఘటన జరిగింది .హీరో  నాని క్షేమంగానే ఉన్నాడు . ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం చిత్రం చేస్తున్నాడు నాని . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All