
హెబ్బా పటేల్ …కుమారి 21ఎఫ్ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈ మహారాష్ట్ర బ్యూటీ..మొదటి చిత్రంతోనే కుర్రకారును కట్టిపడేసింది. అమ్మడి గ్లామర్ సినిమా కు హైలైట్ కావడం..సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం తో హెబ్బా కు వరుస ఛాన్సులు తలుపుతట్టాయి. కుమారి తర్వాత ఈడోరకం ఆడోరకం,
ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న హెబ్బా..ఆ తర్వాత వరుస ప్లాప్స్ అందుకొని ప్రస్తుతం ఛాన్స్ లేకుండా అయిపొయింది. కొన్నాళ్ల కిందట బొద్దుగా తయారై, ఇటీవల ఎంతో నాజూకుగా తయారై సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ షూట్స్ తో అబ్బా అనిపిస్తుంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. దీనిలో భాగంగా ఓ అభిమాని.. మీ వయసు ఎంత అని అడిగాడు. దానికి హెబ్బా.. ‘నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని’ తెలివిగా తన అసలు వయసు ఎంతో చెప్పకుండా సమాధానమిచ్చింది. అలాగే, మీ అందానికి రహస్యమేంటీ..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘అది పెద్ద సీక్రెట్. అసలు బయట పెట్టొద్దు అనుకున్నా.. కానీ, చెప్పక తప్పడం లేదు. దేవుడు ఇచ్చింది కొంతయితే.. డాక్టర్ల కృషి మరికొంత’.. అంటూ షాకింగ్‌గా సమాధానమిచ్చింది.