Homeగాసిప్స్హాట్ భామతో డేటింగ్ నిజమే అని ఒప్పుకున్నాడు

హాట్ భామతో డేటింగ్ నిజమే అని ఒప్పుకున్నాడు

Kim Sharma and Harshavardhan rane

హాట్ భామ కిమ్ శర్మ తో నేను డేటింగ్ లో ఉన్నానని , ఇందులో దాచాల్సిన విషయం ఏమి లేదని తేల్చి పడేసాడు హర్షవర్ధన్ రానే . కిమ్ శర్మ బాలీవుడ్ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ లో కూడా నటించింది . ముఖ్యంగా ఖడ్గం చిత్రంలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ నర్తించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది . కిమ్ శర్మ కు పెళ్లి అయ్యింది కానీ భర్త ని వదిలేసి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్న సమయంలో హర్షవర్ధన్ రానే పరిచయం  అయ్యాడు ఆ పరిచయం కాస్త ఇంకాస్త ముందుకు వెళ్లి సహజీవనం కు దారితీసింది .

గతకొద్ది రోజులుగా ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడటంతో కథనాలు వెల్లువలా వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం తప్పేంటి ? అని ప్రశ్నిస్తున్నాడు హర్షవర్ధన్ రానే . ఈ నటుడు కూడా టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించాడు . బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తో కూడా డేటింగ్ చేసాడు కట్ చేస్తే ఇప్పుడు బాలీవుడ్ లో పడ్డాడు . కిమ్ శర్మ కు 38 సంవత్సరాలు కాగా హర్షవర్ధన్ కు 35 ఏళ్ళు మాత్రమే ! ఏమో ! అందమైన భామలు తమకంటే తక్కువ వయసున్న వాళ్ళని ఇష్టపడుతున్నారు …… పెళ్లి చేసుకుంటున్నారు .

- Advertisement -

English Title: Harshavardhan rane confirms his dating with kim sharma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All