Homeటాప్ స్టోరీస్రహస్య వివాహం చేసుకున్న టాలీవుడ్ నటుడు

రహస్య వివాహం చేసుకున్న టాలీవుడ్ నటుడు

Harish uthaman ties the knot with Amritha kalyanpurటాలీవుడ్ లో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన నటుడు హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం చేసుకున్నాడు . గతకొంత కాలంగా అమృతా కళ్యాణ్ పూర్ ని ప్రేమిస్తున్నాడు హరీష్ ఉత్తమన్ . దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమ వ్యవహారం సాగుతోంది , అయితే ఎట్టకేలకు ఆ ప్రేమని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించిన హరీష్ – అమృత లు ఈనెల 6 న కేరళలోని గురువాయూర్ టెంపుల్ లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు . ఈ పెళ్లి విషయం గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు హరీష్ – అమృత లు .

టాలీవుడ్ లో జై లవకుశ , పవర్ , పండగ చేస్కో , శ్రీమంతుడు , జిల్ , కృష్ణగాడి వీర ప్రేమ గాధ , గౌరవం , ఎక్స్ ప్రెస్ రాజా , దువ్వాడ జగన్నాథం , నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా తదితర చిత్రాల్లో విలన్ గా నటించాడు హరీష్ ఉత్తమన్ . టాలీవుడ్ లోనే కాకుండా పలు తమిళ చిత్రాల్లో , మలయాళ చిత్రాల్లో నటించాడు హరీష్ ఉత్తమన్ . పెళ్లితో ఒక్కటైన ఈ జంట ని అందరూ ఆశీర్వదిస్తున్నారు అసలు విషయం తెలిసి . అలాగే షాక్ అవుతున్నారు కూడా .

- Advertisement -

English Title: Harish uthaman ties the knot with Amritha kalyanpur

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All