
మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా అయినా చేయాలనీ ప్రతి ఒక్క డైరెక్టర్ భావిస్తుంటారు. ఆలా కొంతమందికి అదృష్టం దక్కితే మరికొంతమంది ఆ అదృష్టం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. తాజాగా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ కు చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. గబ్బర్ సింగ్ చిత్రంతో పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ అందించిన హరీష్..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా చేయబోతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత చిరంజీవి తో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.
మలయాళం లో సూపర్ హిట్ అయినా బ్రో డాడీ రీమేక్ ను చిరంజీవి తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. త్వరలోనే ఈ మూవీ కి సంబదించిన విశేషాలు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సల్మాన్ ఖాన్ కీ రోల్ చేస్తున్నాడు.