Homeటాప్ స్టోరీస్హరీష్ రావు కు అడుగడునా అవమానం

హరీష్ రావు కు అడుగడునా అవమానం

తెలంగాణ రాష్ట్రంలో మాస్ లీడర్ గా పేరున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కు అడుగడునా అవమానం జరుగుతూనే ఉంది . గతంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కు ఈసారి తన కేబినెట్ లో చోటు కల్పించలేదు కేసీఆర్ . అయినా హరీష్ రావు గమ్మునే ఉన్నాడు . కానీ కేటీఆర్ ని ఒకవైపు ప్రమోట్ చేస్తూనే హరీష్ రావు ని మాత్రం పక్కన పెడుతున్నారు . ఇప్పటికే పలు ప్రకటనల్లో హరీష్ రావు కు స్థానం కల్పించలేదు .

- Advertisement -

చిల్లర మల్లర నాయకులకు కూడా ప్రకటనల్లో స్థానం కల్పిస్తున్నారు కానీ హరీష్ రావు ని మాత్రం పట్టించుకోవడం లేదు . కేటీఆర్ తెలంగాణ అంతటా తిరుగుతుంటే హరీష్ రావు మాత్రం కేవలం మెదక్ పార్లమెంట్ స్థానానికి మాత్రమే పరిమితం చేసారు . ఉద్యమంలో మాస్ లీడర్ గా ఓ వెలుగు వెలిగిన హరీష్ రావు ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయో అప్పటి నుండి హరీష్ ని కావాలనే పక్కన పెట్టారు అన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది . ఇక జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది . చూస్తుంటే ఈ ధోరణి ఇంకా ఎక్కువ అయ్యేలా కనబడుతోంది . ఇలాగె కొనసాగితే హరీష్ రూపంలో ఏదో ఒక ఉపద్రవం రావడం ఖాయమే అనిపిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All