Homeటాప్ స్టోరీస్పవన్ 5 నెలలు మాత్రమే టైం ఇచ్చాడట

పవన్ 5 నెలలు మాత్రమే టైం ఇచ్చాడట

harihara veeramallu latest update
harihara veeramallu latest update

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం మేకర్స్ కు 5 నెలలు మాత్రమే టైం ఇచ్చాడట. ఈ ఐదు నెలల్లో సినిమా పూర్తి చేయాలనీ చెప్పాడట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 06 నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ జరిగాయి. ఈ సారి భారీ పాన్ ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’తో కొత్త రికార్డులు నమోదు చేయడానికి పక్కాగా రెడీ అవుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All