Homeటాప్ స్టోరీస్ఏప్రిల్ 06 నుండి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్

ఏప్రిల్ 06 నుండి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్

harihara veeramallu latest schedule update
harihara veeramallu latest schedule update

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 06 నుండి రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ జరిగాయి. ఈ సారి భారీ పాన్ ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’తో కొత్త రికార్డులు నమోదు చేయడానికి పక్కాగా రెడీ అవుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All