Homeటాప్ స్టోరీస్హరితేజ వీడియో వైరల్ అవుతోంది

హరితేజ వీడియో వైరల్ అవుతోంది

hariteja emotional video goes viralనటి హరితేజ ఏడుస్తూ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో . ఎంతో చలాకీ అయిన హరితేజ ఏడవడానికి కారణం ఏంటో తెలుసా …… …. సంచలన విజయం సాధిస్తున్న మహానటి చిత్రాన్ని చూడటానికి కుటుంబంతో సహా వెళ్ళింది హరితేజ . అమ్మా -నాన్న , చెల్లి తో కలిసి హరితేజ మహానటి సినిమా చూస్తున్న సమయంలో విశ్రాంతి కాగానే హరితేజ కూర్చున్న స్థానం నుండి అమ్మ పక్కన కూర్చోవడానికి లేచిందట ! ఆ సమయంలో హరితేజ పక్కన మరో ఇద్దరు మహిళలు కూర్చున్నారు అయితే హరితేజ నాన్న ఆ ఇద్దరు మహిళల వైపు కూర్చోవడానికి వస్తుండటంతో గొడవ అయ్యిందట .

మీ సినిమా వాళ్లంటే ఎవరి పక్కనైనా కూర్చుంటారు కానీ మేము ఎందుకు కూర్చుంటాం అని అనడమే కాకుండా సినిమా వాళ్లని అనకూడని మాటలు అందట ! దాంతో హరితేజ కు ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే సదరు మహిళలపై నిప్పులు చెరిగిందట . అయితే వాళ్ళు అన్న మాటలు హరితేజ చెవుల్లో మారుమ్రోగుతుండటంతో కన్నీళ్ల ని ఆపుకోలేపోయింది . అందుకే ఓ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి కావాలి కానీ మీ పక్కన కూర్చొనే అర్హత లేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .

- Advertisement -

https://www.youtube.com/watch?v=JVtP7EvINVc

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All