Homeగాసిప్స్'హరిహర వీరమల్లు' లో పవన్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట..

‘హరిహర వీరమల్లు’ లో పవన్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట..

pawan kalyan rehearsing for hariharaveeramallu
pawan kalyan rehearsing for hariharaveeramallu

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది.

కాగా ఈ సినిమా తాలూకా ఓ వార్త ప్రస్తుతం అభిమానులను ఖుషి చేస్తుంది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్ర యోధుడిలా రాబిన్‌హుడ్‌ను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో పవన్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. మూడు పాత్రల్లోనూ ‘హరి హర వీరమల్లు’ పాత్రదే స్పెషల్‌ అట్రాక్షన్‌ అంటున్నారు. ఈ సినిమాలో పవన్‌ పాత్రలను దృష్టిలో పెట్టుకుని 30 రకాల విభిన్న దుస్తులు సిద్ధం చేసిందట చిత్ర బృందం. ప్రతి డ్రెస్‌ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట. మరి పవన్‌కల్యాణ్‌ ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All