Homeటాప్ స్టోరీస్జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి "హ్యాపి వెడ్డింగ్ " ఇన్విటేష‌న్‌

జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి “హ్యాపి వెడ్డింగ్ ” ఇన్విటేష‌న్‌

happy wedding movie invitationవ‌రుడు..
ల‌వ‌ర్స్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌

వ‌ధువు..
అచ్చ‌తెలుగు చీర‌క‌ట్టు తో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్ల గా తెలుగు తెర‌కి పరిచ‌య‌మ‌య్యి ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌రిక కొణిదెల

- Advertisement -

పెళ్ళిపెద్ద‌లు..
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా

పురోహితుడు..
యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య

మంగ‌ళ‌వాయిద్య‌కారులు…
సంగీతం- శక్తికాంత్, రీరికార్డింగ్‌- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌

కెమెరా..
ఎన్నోచిత్రాలకి త‌న మంచి ప‌నిత‌నాన్ని అందించిన బాల‌రెడ్డి

తేది.. జూన్ 21 , గురువారం, 2018

 

సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా “హ్యాపి వెడ్డింగ్” యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు. చ‌క్క‌టి ఫ్యామిలి ఎమెష‌న్స్ సున్నిత‌మైన స‌న్నివేశాలు, చిలిపి గా సాగే క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ చాలా బాగా తెర‌కెక్కించాడు.. వీటికి తమన్ త‌న‌ రీ రీ రికార్డింగ్ చేసి మ‌రింతగా ఎలివేట్ చేస్తున్నారు. ఫిదా చిత్రం తో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్ ఫీస్ట్ అందించిన శక్తికాంత్ అద్భుతమైన పాటలు అందించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు త‌మ ఆనందాన్ని పంచుకుంటూ..

యు వి క్రియేష‌న్స్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ తొ క‌ల‌సి పాకెట్ సినిమా బ్యాన‌ర్ లో చ‌క్క‌టి తెలుగు చిత్రంగా మేము నిర్మించిన హ్య‌పివెడ్డింగ్ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది. సుమంత్ అశ్విన్‌, నిహారిక వారి పాత్ర‌ల్లో చాలా చ‌క్క‌గా ఒదిగిపోయారు. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కుర్ర‌కారుని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. స‌న్నివేశానికి డైలాగ్స్ ఎంత ఊపిరినిచ్చాయో థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాన్ని మించి వుంద‌ని చెప్ప‌టం అతిశ‌యోక్తికాదు. అలాగే ఫిదా లాంటి మ్యూజిక్ ఛార్ట్‌బ‌స్ట‌ర్ ని అందించిన శక్తికాంత్ కార్తిక్ అందించిన‌ మ్యూజిక్ ఛార్ట్ బ‌స్ట‌ర్ లో నిల‌బ‌డిపోతాయి. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన హ్య‌పివెడ్డింగ్ ఇన్విటేష‌న్ ని జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు విడుద‌ల చేస్తున్నాము. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా మా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం జ‌రిగివుంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌నితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వ‌ర్గాల , అన్ని వ‌య‌సుల వారు ఈ చిత్రానికి క‌నెక్ట్ అవుతారు. అతిత్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అని అన్నారు..

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..

యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
మ్యూజిక్ డైరెక్టర్ – శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ – ఎస్. ఎస్. తమన్
కెమెరా – బాల్ రెడ్డి
మ్యూజిక్ – శ‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ – పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All