Homeటాప్ స్టోరీస్పెళ్లెప్పుడంటే యూట్యూ‌బ్‌లో చెబుతుంద‌ట!‌

పెళ్లెప్పుడంటే యూట్యూ‌బ్‌లో చెబుతుంద‌ట!‌

పెళ్లెప్పుడంటే యూట్యూ‌బ్‌లో చెబుతుంద‌ట!‌
పెళ్లెప్పుడంటే యూట్యూ‌బ్‌లో చెబుతుంద‌ట!‌

త‌మిళ హీరో శింబుతో పీక‌ల్లోతూ ప్రేమాయ‌ణాన్ని సాగించింది హ‌న్సిక‌. కొన్నాళ్ల పాటు సాగిన వీరి ప్రేమ‌క‌థ ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో విడిపోయిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత మ‌ళ్లీ ప్రేమ పేరెత్త‌ని హ‌న్సిక మ‌ళ్లీ శింబుతో స్నేహం చేస్తోంది. అదేమంటే మాజీ ప్రేమికులు స్నేహితులుగా మారితే త‌ప్పేంట‌ని చెబుతోంది.

ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ ఛాన‌ల్‌ని ప్రారంభించిన హన్సిక తాజాగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని నెటిజ‌న్స్‌తో పంచుకుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన హ‌న్సిక త‌న లేటెస్ట్ చిత్రాల‌తో పాటు, వెబ్ సిరీస్‌తో పాటు త‌న పెళ్లి సంగ‌తులు కూడా చెప్పేసింది. త్వ‌ర‌లోనే త‌న‌కు సంబంధించిన క్వారెంటైన్ వీడియోని యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేస్తున్నాన‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

మాజీ ల‌వ‌ఱ్ శింబు గురించి వెల్ల‌డిస్తూ శింబు త‌నకు గ‌తంలో ల‌వ‌ర్ అని, అయితే ఇప్పుడు ఇద్ద‌రం మంచి స్నేహితులం అయ్యామ‌ని, అలా కాకూడ‌ని ఎక్క‌డా లేద‌ని, హార‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ చేస్తున్నాన‌ని, 10 ఎపిసోడ్స్‌తో వుంటుందని. దీనికి `న‌షా` అనే టైటిల్ అనుకుంటున్నాం అని తెలిపింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ `ప్ర‌స్తుతానికి పెళ్లి ఆలోచ‌న లేదు. ఆ ఉద్దేశ్యం వుంటే త‌ప్ప‌కుండా త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వెల్ల‌డిస్తాన‌ని చెప్పింది హ‌న్సిక‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All