Homeటాప్ స్టోరీస్హ్యాయ్ ల్యాండ్ ఎండీని అరెస్ట్ చేసిన సిఐ డి

హ్యాయ్ ల్యాండ్ ఎండీని అరెస్ట్ చేసిన సిఐ డి

Haailand MD arrested in agrigold caseహ్యయ్ ల్యాండ్ కు అగ్రిగోల్డ్ కు ఏమాత్రం సంబంధం లేదని కేసుని తప్పుదోవ పట్టించే కుట్ర చేసిన హ్యయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వర్ రావు ని నిన్న రాత్రి సి ఐ డి పోలీసులు అరెస్ట్ చేసారు . అగ్రిగోల్డ్ పెద్ద ఎత్తున ప్రజల నుండి రకరకాల ఆకర్షణీయమైన పథకాలతో మోసం చేసి పెట్టుబడులను స్వీకరించారు . ప్రజల నుండి వచ్చిన వందల కోట్ల ని పెద్ద ఎత్తున డొల్ల కంపెనీ లను సృష్టించి వాటిలో పెట్టుబడులుగా పెట్టారు . అంతేకాదు హ్యాయ్ ల్యాండ్ లో పెట్టిన పెట్టుబడులు కూడా ప్రజల నుండి సేకరించిన సొమ్మే ! పైగా అగ్రిగోల్డ్ నిర్వాహకులే ఈ హ్యయ్ ల్యాండ్ నిర్వాహకులు కూడా . అయితే ఇటీవలే కోర్టు లో హ్యాక్ ల్యాండ్ కు అగ్రిగోల్డ్ కు సంబంధం లేదని చెప్పడమే కాకుండా తెరవెనుక పెద్ద కుట్ర చేయడంతో ఆ కుట్ర ని చేధించే క్రమంలో రంగప్రవేశం చేసిన ఆంధ్రప్రదేశ్ సి ఐ డి అధికారులు నిన్న అల్లూరి వెంకటేశ్వర్ రావు ని అరెస్ట్ చేసారు .

చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వం ని కోర్టు ని ఓ ఆట ఆడిద్దామని చేసిన కుట్ర ని భగ్నం చేసారు పోలీసులు . హ్యయ్ ల్యాండ్ ని వేలం వేయకుండా ఉండటానికి హ్యయ్ ల్యాండ్ కు అగ్రిగోల్డ్ కు సంబంధం లేదని కోర్టుకి తెలిపారు . అయితే ఇవన్నీ అగ్రిగోల్డ్ కి సంబంధించినవే అని ఇప్పటికే సి ఐ డి అధికారులు నిర్దారణకు వచ్చారు . ఇక వేలం వేయడమే తరువాయి అన్న సమయంలో ఇలా కుట్ర కు తెరలేపారు . దాంతో హ్యయ్ ల్యాండ్ వేలం కొద్దిరోజుల పాటు నిలిచిపోనుంది . ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన అగ్రిగోల్డ్ నిర్వాహకుల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు . అల్లూరి వెంకటేశ్వర్ రావు అరెస్ట్ తో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు .

- Advertisement -

English Title: Haailand MD arrested in agrigold case

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All