Homeటాప్ స్టోరీస్హెచ్ 1 బీ ల శ్రమ దోపిడీ

హెచ్ 1 బీ ల శ్రమ దోపిడీ

H-1B visa holders underpaidఅగ్ర రాజ్యం అమెరికాలో హెచ్ 1 బీ వీసా తో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల శ్రమని అడ్డంగా దోచేస్తున్నాయి అక్కడి కంపెనీలు . శ్రమ దోపిడీ మాత్రమే కాకుండా వేధింపులకు కూడా గురౌతున్నారు దాంతో కొంతకాలంగా హెచ్ 1 బీ వీసాదారులు చేస్తున్న ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది . ఇక ట్రంప్ సర్కార్ కూడా నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను ప్రోత్సహిస్తామని , అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేలా వీసా విధానంలో మార్పులు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో హెచ్ 1 బీ వీసాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

అయితే పని చేసే సంస్థల చోట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని , అలాగే హెచ్ 1 బి ఉద్యోగుల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళ వేతనాలను పెంచాలని కోరుతున్నారు . ఉద్యోగుల భర్తీ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తే ,హెచ్ 1 బి వీసాల జారీ ప్రక్రియలో లాటరీ విధానానికి స్వస్తి పలికి ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు, అందునా నైపుణ్యం కలిగిన వాళ్లకు ముందుగా ఇస్తే మరింత ప్రయోజనకారిగా ఉంటుందని అంటున్నారు . టెక్నాలజీ లో భారతీయులు మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు హెచ్ 1 బి వీసా తో తక్కువ వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు అయితే వాళ్లలో నైపుణ్యం కలిగిన వాళ్ళని ఉన్నత స్థానాల్లోకి తీసుకుంటే అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరింతగా బలపడుతుందని కోరుతున్నారు . సౌత్ ఆసియా సెంటర్ ఫర్ ది అట్లాంటిక్ కౌన్సిల్ జరిపిన సర్వేలో హెచ్ 1 బి వీసాల సరళతరం గురించి , భారతీయుల వేతనాల గురించి , అక్కడి పరిస్థితుల గురించి తేలింది . హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విధానంతో హెచ్ 1 బి వీసాలు మరింత సులభతరం అవుతాయని భావిస్తున్నారు .

- Advertisement -

English Title: H-1B visa holders underpaid

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All