Homeటాప్ స్టోరీస్మరో గొప్ప పని చేసిన రాఘవ లారెన్స్

మరో గొప్ప పని చేసిన రాఘవ లారెన్స్

Great human being Raghava lawrenceహీరో , దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు . ఈరోజు ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు , ఆ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఇప్పటివరకు 153 మందికి సక్సెస్ ఫుల్ గా గుండె ఆపరేషన్ చేయించానని ట్వీట్ చేసాడు . రాఘవ లారెన్స్ పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి , అలాగే కొరియోగ్రాఫర్ గా కాకుండా కేవలం పొట్ట కూటి కోసం డ్యాన్సర్ గా అవతారం ఎత్తాడు కష్టానికి అదృష్టం కూడా తోడయ్యింది అందుకే కొరియోగ్రాఫర్ అయ్యాడు . అంతేనా దర్శకుడిగా , హీరోగా కూడా సత్తా చాటాడు .

 

- Advertisement -

గుండె ఆపరేషన్ చేయించుకోలేక , ఆర్ధిక స్థోమత లేని వాళ్ళ కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు లారెన్స్ , ఆ ట్రస్ట్ ద్వారా గుండె ఆపరేషన్ లు చేయిస్తున్నాడు . అలాగే ఇంకా ఇలాంటి పేదవాళ్ళు కోకొల్లలు అందుకే మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాళ్లు ఉంటే వాళ్ళని మా ట్రస్ట్ కి తీసుకురండి ఆపరేషన్ చేయిస్తానని అంటున్నాడు లారెన్స్ .

English Title: Great human being Raghava lawrence

 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All