Homeటాప్ స్టోరీస్కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం"మూవీ రివ్యూ

కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”మూవీ రివ్యూ

కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం"మూవీ రివ్యూ
కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”మూవీ రివ్యూ

నటీనటులు:
విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : అల్లంనేని అయ్యప్ప,
రచన దర్శకత్వం : శివన్‌ జంపాన.
సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌,
సంగీతం : వర్ధన్‌,
ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి,
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజికల్ : చిన్నా,
ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు,
పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్
రేటింగ్: 2.75/5

- Advertisement -

కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు.. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సినిమానే
“గ్రంధాలయం”. విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన “గ్రంధాలయం” సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ:
ఒక గ్రంధాలయం లో ఉన్న 1965 నాటి బుక్ ను అందరూ చదవలేరు. అయితే చదవాలని ప్రయత్నించి మూడు రోజులు చదివిన తరువాత చదివిన వారందరూ
చనిపోతుంటారు. ఆలా అప్పటి వరకు సుమారు 100 మంది ఆ బుక్ చదివి చనిపోయింటారు. అయితే హీరో రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), హీరోయిన్ ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) ప్రేమించుకొని ఉంటారు. అయితే అనుకోకుండా తను ఈ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ కు ఆ బుక్ ను మూడు రోజులు చదివిన తరువాత చనిపోతారానే విషయం తెలుసుకొని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది.ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు?. చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకువాలని ఒకరోజు రాత్రి కెమెరా తీసుకొని రహస్యంగా గ్రంధాలయం లొకి వస్తాడు. గ్రంధాలయం లొకి వచ్చిన తరువాత అక్కడ తనకు ఎదురైనా సంఘటనలు ఏమిటి, ఆ బుక్ ను చదివిన హీరోయిన్ ను చనిపోకుండా ఆపగలిగాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే . సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గ్రంధాలయం సినిమా చూడాల్సిందే..

నటీ, నటులు:
శేఖరం అబ్బాయి సినిమా తర్వాత చేసిన హీరో విన్ను రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు.తన హావ భావాలతో నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇది సెకండ్ మూవీ ఇందులో చాలా బాగా నటించాడు.. ఇందుమతి వాత్సల్య పాత్రలో నటించిన హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. విలన్ గా నటించిన కాలకేయప్రభాకర్‌, అలాగే ఇందులో నటించిన సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీ విశ్వనాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు అంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు:
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే నే ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇప్పటి వరకు రానటువంటి కొత్త కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆలా వచ్చిన కొత్త కథే “గ్రంధాలయం “. కలగా వచ్చిన కథను సినిమాగా మార్చి రివర్స్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని ఆకట్టు కోనేలా సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు సాయి శివన్‌ జంపాన సక్సెస్ అయ్యాడు అని చెప్పచ్చు. సామలభాస్కర్‌ చేసిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.చిన్నా చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి.

శేఖర్‌పసుపులేటి ఎడిటింగ్ పని తీరు బాగుంది.వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో ఎంతో నిజాయితీగా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ సాయి శివన్‌ జంపాన కు ఉన్న నాలెడ్జ్ తో “గ్రంథాలయం”.సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తంగా చెప్పాలి అంటే “గ్రంథాలయం”.” ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను నమ్మి వచ్చిన ప్రేక్షకులందరినీ కచ్చితంగా  అలరిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All