Homeటాప్ స్టోరీస్విజయం కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాడు

విజయం కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాడు

gopichand hopes on pantham 2014 లో వచ్చిన లౌక్యం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో గోపీచంద్ . చిన్న చిత్రంగా వచ్చిన ఆ చిత్రం పెద్ద పెద్ద సినిమాలను పక్కన పెట్టి మరీ తన ప్రత్యేకత నిలుపుకుంది . అయితే ఆ సినిమా తర్వాత గోపీచంద్ నటించిన చిత్రాలు ఏవి కూడా విజయాన్ని అందుకోలేక పోయాయి. నాలుగేళ్లుగా విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు గోపీచంద్ . ఎంటర్ టైన్ మెంట్ తో సాగిన లౌక్యం గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అయితే దాని తర్వాత ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అన్ని కూడా ప్లాప్ అయ్యాయి దాంతో విజయం కోసం నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు గోపీచంద్ .

తాజాగా కొత్త దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన పంతం చిత్రం చేసాడు . ఈరోజు ఆ సినిమా విడుదల అయ్యింది . ఈ సినిమాపైనే గోపీచంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు . మెహరీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది . మెహెరీన్ నటించిన చిత్రాలు దాదాపుగా విజయం సాధించాయి హీరోలకు సక్సెస్ ని కట్టబెట్టాయి . మరి గోపీచంద్ కు ఈ పంతం తో హిట్ కట్టబెడుతుందా చూడాలి .

- Advertisement -

కేకే రాధామోహన్ నిర్మించిన పంతం చిత్రం లో సందేశంతో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు . రెండు మిక్స్ చేసి చేస్తుండటంతో తప్పకుండా హిట్ కొడతా అని ఆశగా ఉన్నాడు గోపీచంద్ .

English Title: gopichand hopes on pantham

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All