Homeటాప్ స్టోరీస్సింగ‌ర్ ప్రేమ‌లో క్రేజీ సంగీత ద‌ర్శ‌కుడు!

సింగ‌ర్ ప్రేమ‌లో క్రేజీ సంగీత ద‌ర్శ‌కుడు!

సింగ‌ర్ ప్రేమ‌లో క్రేజీ సంగీత ద‌ర్శ‌కుడు!
సింగ‌ర్ ప్రేమ‌లో క్రేజీ సంగీత ద‌ర్శ‌కుడు!

గోపీ సుంద‌ర్‌.. ఆయ‌నో క్రేజీ సంగీత ద‌ర్శ‌కుడు.. ఆయ‌న సంగీతం అందించిన ప్రేమ‌మ్‌, ఊపిరి, గీత గోవిందం, నిన్ను కోరి వంటి చిత్రాలు మంచి విజ‌యాల్ని సాధించాయి. ఈ చిత్ర విజ‌యాల్లో గోపీ సుంద‌ర్ అందించిన సంగీతం ప్ర‌ధాన పాత్ర పోషించింది. దీంతో మ‌ల‌యాళంలో క‌న్నా తెలుగులోనే ఆయ‌న‌కు క్రేజీ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి. వ‌రుస ఆఫ‌ర్ల‌తో గోపీసుంద‌ర్ య‌మ బిజీగా వున్నారు.

అయితే ఆయ‌న గ‌త కొంత కాలంగా ఓ సింగ‌ర్ అభ‌య హిర‌ణ్మ‌యితో ప్రేమ‌లో వున్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా గోపీసుంద‌ర్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్ల‌డించారు కూడా. అభ‌య‌తో క‌లిసి తీసుకున్న ఓ ఫొటోని షేర్ చేసిన ఆయ‌న తాను త‌ప్పుకోవ‌డానికి కార‌ణం నువ్వే అంటూ ఆ ఫొటోకు క్యాప‌ష‌న్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

గోపీసుంద‌ర్ ఎనిమిదేళ్ల క్రితం ప్రియా అనే యువ‌తిని వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా వున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ఇద్ద‌రు విడిపోవాల‌నుకుంటున్నారు. ఇటీవ‌లే విడాకుల కోసం అప్లై కూడా చేసుకున్నారు. తాజాగా గోపీసుంద‌ర్ అభ‌య‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేయ‌డంతో ఆస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. అభ‌య హ‌ర‌ణ్మ‌యి కూడా గోపీసుంద‌ర్‌తో త‌న‌కున్న అనుబంధం గురించి ప్ర‌పంచానికి వెల్ల‌డించింది. `అవును పెళ్లైన వ్య‌క్తితో క‌లిసి గ‌త ఎనిమిదేళ్లుగాస‌హ‌జీవ‌నం సాగిస్తున్నాను` అని స్ప‌ష్టం చేసింది.

 

View this post on Instagram

 

You are the reason I exist ❤️

A post shared by Gopi Sundar Official (@gopisundar__official) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All