Homeగాసిప్స్ఎన్టీఆర్ పుట్టిన రోజున స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!

ఎన్టీఆర్ పుట్టిన రోజున స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!

ఎన్టీఆర్ పుట్టిన రోజున స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!
ఎన్టీఆర్ పుట్టిన రోజున స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్నారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేస్తార‌ని ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని క్యాప్చ‌ర్ చేయ‌లేక‌పోయామ‌ని, దాంతో టీజ‌ర్ క‌ష్ట‌మ‌నే సంకేతాల్ని రాజ‌మౌళి అందించ‌డంతో ఫ్యాన్స్ అంతా నిరాశ‌కు గుర‌వుతున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే ఎన్టీఆర్ పుట్టిన  రోజు ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ రాబోతున్న‌ట్టు తెలిసింది. త్ర‌విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోని పుట్టిన రోజున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే రోజు `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ – ఎన్టీఆర్‌తో క‌లిసి చేయ‌నున్న సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్‌ని మైత్రీ సంస్థ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా మైత్రీలో ప్ర‌శాంత్ నీల్ ఓ భారీ చిత్రాన్ని చేనున్నార‌ని, అందులో ఎన్టీఆర్ న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All