Homeటాప్ స్టోరీస్ఆర్టిస్టుల‌కు `గోల్డేజ్ హోమ్` ఇవ్వ‌డం నా డ్రీమ్‌! -`మా` అధ్య‌క్షులు శివాజీ రాజా

ఆర్టిస్టుల‌కు `గోల్డేజ్ హోమ్` ఇవ్వ‌డం నా డ్రీమ్‌! -`మా` అధ్య‌క్షులు శివాజీ రాజా

Goldage home is my dream - shivajirajaప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న న‌టుడిగా శివాజీ రాజా సుప‌రిచితం. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ప‌లు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించిన అనుభ‌వ‌జ్ఞుడు. ప్ర‌స్తుతం `మా` అధ్య‌క్షుడిగా ఆయ‌న ఎన్నో ప్ర‌యోజ‌న‌కర కార్య‌క్ర‌మాల్ని అమ‌ల్లోకి తెచ్చి స‌క్సెస్ చేయ‌డంపై టాలీవుడ్ స‌హా ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పేద క‌ళాకారుల కుటుంబాల్లోని పిల్ల‌ల కోసం విద్యా ల‌క్ష్మి, క‌ళ్యాణ ల‌క్ష్మి వంటి ప‌థ‌కాల్ని ప్ర‌వేశ పెట్టారు. 35 మందికి వృద్ధుల‌కు ఫించ‌న్ రూ.5000కు పెంచి అంద‌రి మెప్పు పొందారు. ప్ర‌స్తుతం ఓల్డేజ్ హోమ్ (వృద్ధాశ్ర‌మం) నిర్మాణం, మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మాణ‌మే ధ్యేయంగా ఆయ‌న ప‌ని చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు.

*నాకు పుట్టిన‌రోజులు చేసుకునే అల‌వాటు లేదు. 32 ఏళ్ల‌ కెరీర్‌లో ప‌రిశ్ర‌మ‌లో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బ‌ర్త్ డే పార్టీ ఇచ్చాను. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే బ‌ర్గ్ డే. ఈసారి మ‌రిన్ని మంచి పనుల గురించి చెప్పేందుకు ఇదో వేదిక‌.

- Advertisement -

ఇక్క‌డ పుట్టినందుకు ఎవ‌రికైనా దానం చేయ‌డం.. సాయం చేయ‌డం అనేదే చేస్తున్నా.

*మా అధ్య‌క్షుడిగా రెండేళ్లు పూర్త‌యింది. ఆర్టిస్టులంతా మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఉండాల‌ని కోరారు. అయితే నేను ఉండ‌ను.. ఎవ‌రైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్క‌సారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు.

*ఈ రెండేళ్ల పాల‌నలో ఒకే ఒక్క‌టి. నా గురించి చెడుగా చెప్ప‌డం. క‌ష్టాల్లో ఉన్న‌వారికి సాయ‌ప‌డే త‌త్వం నాది. ర‌క‌ర‌కాల సేవ‌లు చేసాను. కానీ ఎంతో సేవ చేస్తుంటే.. దానిపై కామెంట్లు చేయ‌డం బాధ అనిపించింది. ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఆండాల‌ని కోరుకుంటాను. ఈసారి త‌నీష్, ఖయూమ్  లాంటి యువ‌కులు మా ప్యానెల్ లో పోటీ చేస్తున్నారు. భ‌విష్య‌త్ త‌రం బావుండాల‌నే ప్ర‌య‌త్న‌మిది.

*మా అసోసియేష‌న్ సిల్వ‌ర్ జూబ్లీ సంవ‌త్స‌రం ఇది. ఏ గొడ‌వ‌లు లేకుండా సంతోషంగా మా సాగాలి. క‌ళాకారులు న‌న్ను ఎంత గౌర‌వంగా ఎన్నుకున్నారో అంతే గౌర‌వంగా చూసుకుంటాను.

*మూవీ ఆర్టిస్టుల సంఘం నా సొంతం కాదు.. ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవ‌మా? అంటే చెప్ప‌లేను. ఎవ‌రైనా పోటీకి దిగొచ్చు. అలాగే నాకు నా కుటుంబం  నుంచి అన్నివేళ‌లా స‌పోర్ట్ ద‌క్కింది. మా అబ్బాయి హీరోగా కెరీర్ మొద‌లు పెట్టాడు. హ్యాపీగా ఉండొచ్చు క‌దా? అంటే.. నా చుట్టూ ఉన్న‌వారికి మంచి చేసేందుకు ఇలా చేస్తున్నా. అలాగే మా అబ్బాయి న‌టించిన తొలి సినిమా ఏప్రిల్ లో రిలీజ‌వుతోంది. రెండో సినిమా ప్రారంభం కానుంది.

*చివ‌రి 16 ఏళ్ల జీవితం బోన‌స్. యాక్సిడెంట్ త‌ర్వాత జీవితం అంతా బోన‌స్ కిందే లెక్క‌. మంచి చేయ‌డ‌మే నా ప‌ని. దానికోసం ఏదైనా చేస్తాను.

*ఓల్డేజ్ హోమ్ నిర్మాణం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇప్ప‌టికే ఓ ఎన్నారై ఆరు ఎక‌రాల భూమిని దాన‌మిస్తాన‌ని అన్నారు. అలాగే శంక‌ర్ ప‌ల్లి స‌మీపంలో ప‌ది ఎక‌రాలు ఇచ్చేందుకు వేరొక వ్య‌క్తి సిద్ధంగా ఉన్నారు. వాటి నుంచి ఎంపిక చేసుకుని చేయాల్సి ఉంది. అలాగే ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి వెట‌ర‌న్ హీరో, ద‌ర్శ‌కుడు రంగ‌నాథ్ మ‌ర‌ణ‌మే కార‌ణం. ఆయ‌న చివ‌రి రోజుల గురించి మీకు తెలిసిందే.

*ఈ ఏడాది జ‌ర్న‌లిస్టుల్లో అవ‌స‌రార్థం ఉన్న‌వారికి..  బైక్ కొని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాగే ఓల్డేజ్ హోమ్ లో పెద్ద వారైన జ‌ర్న‌లిస్టుల‌కు 10శాతం అవ‌కాశాలు క‌ల్పించే ఆలోచ‌న ఉంది. హెల్త్ క్యాంప్స్ వంటి వాటిలో జ‌ర్న‌లిస్టులకు ఉచితంగా సేవ‌లందిస్తున్నాం.

* మూవీ ఆర్టిస్టుల సంఘం త‌ర‌పున ప‌ని చేస్తూ ఆర్టిస్టుగానూ నటించ‌వ‌చ్చు. 24 గంట‌ల స‌మ‌యం ఉంది మ‌న చేతిలో. రెండుసార్లు ఈసీ మెంబ‌ర్ గా, రెండు సార్లు ట్రెజ‌ర‌ర్ గా, రెండు సార్లు ఉపాధ్య‌క్షుడిగా, రెండుసార్లు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా, ఒక‌సారి అధ్య‌క్షుడిగా ప‌ని చేశాను. ఇంత అనుభ‌వంతో నేను ఏదైనా మంచి చేయ‌గ‌ల‌ను. ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌గ‌ల‌ను. నా చుట్టూ పాజిటివ్ గా ఉండేవాళ్ల వ‌ల్ల‌నే నేను ఎంతైనా చేస్తాను.

*మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మాణం స‌హా ప‌లు సేవాకార్య‌క్ర‌మాల కోసం సాయం కోరితే మెగాస్టార్ చిరంజీవి ఎంతో స‌హాయం చేశారు. విదేశాల్లో నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. ఆ క‌ష్టం ఎందుకు కావాలి అంటే నేనే మొత్తం సాయం చేస్తాను అని అన్నారు. అయితే ఆర్టిస్టులంద‌రి త‌ర‌పున ఈ కార్య‌క్ర‌మం చేయాల‌ని అనుకుంటున్నామ‌ని అడిగితే విదేశాల‌కు వ‌చ్చారు. సైరా సినిమా బిజీ షెడ్యూల్స్ లోనూ రెండ్రోజుల స‌మ‌యం కేటాయిస్తాన‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒక‌సారి కాదు.. రెండ్రోజుల కార్య‌క్ర‌మం కోసం రెండుసార్లు అమెరికా వ‌చ్చేస్తాన‌ని చిరంజీవి గారు అన్నారు. ఆయ‌న ప్రోత్స‌హంతో కలిపి  విజ‌యవంతంగా  నిధిని సేక‌రించాం. త‌దుప‌రి నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తాం. ప్ర‌భాస్, నాగార్జున గారిని సంప్ర‌దిస్తే ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ఇంకా పెద్ద స్టార్ల స‌హ‌కారం ఉంటుంది. మ‌హేష్ గారితో దుర‌దృష్ట‌వ‌శాత్తూ క్యాన్సిల్ అయ్యింది. న‌మ్ర‌త‌గారితో ట‌చ్ లోనే ఉన్నాం. పేద‌ల సాయం కోసం వారు ముందుకు వ‌స్తారు. అలాగే లండ‌న్ లో ఏప్రిల్ లో నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేస్తున్నాం.

*గోల్డేజ్ హోమ్ విరాళాలు:

గోల్డేజ్ హోమ్(ఓల్డేజ్ హోమ్) కోసం రెండు స్థ‌లాలు పరిశీల‌న‌లో ఉన్నాయి. 10 ఎక‌రాలు ఓచోట‌, 6 ఎక‌రాలు ఓ చోట చూశాం. వీటిలో ఫైన‌లైజ్ చేస్తాం. ఈ గోల్డేజ్ హోమ్ నిర్మాణం కోసం ఇప్ప‌టికే విరాళాలు అందాయి. నాగినీడు – 1ల‌క్ష‌, శ్రీ‌కాంత్ -1.16ల‌క్ష‌లు, శివాజీ రాజా -1.16 ల‌క్ష‌లు, సురేష్ కొండేటి- 50 వేలు, ఏడిద శ్రీ‌రామ్ -50 వేలు,  బెన‌ర్జీ- 50వేలు, గురురాజ్ -1ల‌క్ష‌, ఉత్తేజ్ -10,116 డొనేట్ చేశారు. ఇంకా ఎంద‌రో ఆర్టిస్టులు డొనేట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దీని కోసం ఎంతో సాయం చేస్తున్నారు. ముందుగా మా అసోసియేష‌న్ సొంత భ‌వంతిని నిర్మిస్తాం. అన్నా రు శివాజీ రాజా.

English Title: Goldage home is my dream – shivajiraja

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All