Homeటాప్ స్టోరీస్ప్రేమ పేరుతో యువకులను మోసం చేసిన నటి

ప్రేమ పేరుతో యువకులను మోసం చేసిన నటి

ఆమె ఓ నటి పైగా ప్రేమిస్తున్నానంటూ యువకుల వెంట పడటంతో మోసపోయారు ఇలా ఒకరిద్దరు కాదు నలుగురైదుగురిని మోసగించిందట దాంతో అందులో ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో పాపం ! ఆ నటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది . ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా ? శృతి అనే తమిళ నటి . చిన్న చిన్న వేషాలు వేసుకునే ఈ భామ డబ్బున్న వాళ్ళని పసిగట్టి ప్రేమ పేరుతో తిప్పుకొని వాళ్ళ దగ్గర డబ్బులు , నగలు తీసుకోవడం అలవాటుగా చేసుకుంది .

ఇలా పలువురు యువకులను మోసగించడంతో కొంతమంది సైలెంట్ అయిపోగా సంతోష్ కుమార్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాత్రం పోలీసులకు శృతి పై ఫిర్యాదు చేసాడు దాంతో శృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి ఆమె దగ్గర ఉన్న 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు . ఇంకా బ్యాంక్ ఖాతాలలో డబ్బులు ఏమైనా ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All