Homeటాప్ స్టోరీస్గోవా బ్యూటీ న్యూ లుక్ అదిరిందిగా!

గోవా బ్యూటీ న్యూ లుక్ అదిరిందిగా!

గోవా బ్యూటీ న్యూ లుక్ అదిరిందిగా!
గోవా బ్యూటీ న్యూ లుక్ అదిరిందిగా!

ఇటీవ‌ల గోవా బీచ్‌లో టూ పీస్ బికినీ ధ‌రించి హ‌ల్ చ‌ల్ చేసిన త్రో బ్యాక్ పిక్స్‌తో పిచ్చెక్కిచ్చిన గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మ‌రో ఫొటోని షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో వున్న ఇలియానాని చూస్తే షాకవ్వాల్సిందే. స్లిమ్‌గా మారి స‌రికొత్త లుక్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అయిన ఇల్లీ బేబీ అందాలు నెటిజ‌న్స్‌ని కిర్రెక్కిస్తున్నాయి. అస్ట్రేలియ‌న్ ఫొటోగ్రాఫ‌ర్ తో డేటింగ్ చేస్తూ సినిమాల‌కు దూర‌మైన ఇలియానా ఆ త‌రువాత త‌న అందం గురించి ప‌ట్టించుకోవ‌డం మానేసిం‌ది.

దీంతో స్లిమ్‌గా నాజూకు న‌డుమొంపుల‌తో కుర్ర‌కారుకి గిలిగింత‌లు పెట్టే ఇలియానా బొద్దుగా మారిపోయింది. తెలుగులో రీఎంట్రీ కోసం చేసిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రంలో ఇలియానా లుక్ చూసి నెటిజ‌న్స్‌తో పాటు ఆడియ‌న్స్ ఇలియానా బొద్దుగా మారిపోయింద‌ని, ఆంటీలా వుంద‌ని కామెంట్‌లు చేశారు. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఇలియానా లాక్ డౌన్ పిరియ‌డ్ నుంచి స్లిమ్‌గా మార‌డానికి భారీగా క‌స‌ర‌త్తులు చేయ‌డం మొద‌లుపెట్టింద‌ట‌.

- Advertisement -

తాజాగా స్లిమ్ లుక్‌లోకి మారిన ఇలియానా సోష‌ల్ మీడియాలో ఓ పిక్‌ని షేర్ చేసింది. ఆ ఫొటో చూసిన వారంతా ఇలియానా నేనా అని అవాక్క‌వుతున్నారు. అంత అందంగా నాజూకుగా త‌యారై షాకిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. యెద అందాల‌ని క‌ను విందు చేస్తున్న ఇలియానా ఫొటోని చూసి మ‌ళ్లీ తెలుగు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఇలియానా డేట్స్ కోసం ఎగ‌బ‌డ‌తారో చూడాలి. ఇలియానా న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం `ది బిగ్ బుల్‌`. అభిషేక్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని స్టాక్ మార్కెట్ బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మొహ‌తా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All