Homeటాప్ స్టోరీస్వినాయక్ ఇంటిని కూల్చివేసిన అధికారులు

వినాయక్ ఇంటిని కూల్చివేసిన అధికారులు

vv vinayak
vv vinayak

మాస్ దర్శకులు వివి వినాయక్ ఇంటిని కూల్చివేశారు జి హెచ్ ఎం సి అధికారులు . నార్సింగ్ లో గల వినాయక్ ఇంటి తో పాటుగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తునారు . తీసుకున్న పర్మీషన్ ని ధిక్కరించి అదనపు స్లాబులను , అదనపు గదులను నిర్మిస్తున్న వాళ్ళని ఉపేక్షించడం లేదు అధికారులు . మళ్ళీ వర్షాకాలం రావడంతో నాళాలకు ఇబ్బందులు కలిగించే వాటిపై దృష్టి పెట్టారు .

అందులో భాగంగానే దర్శకులు వివివినాయక్ అనుమతులను అతిక్రమించి నిర్మించిన వాటిని కూల్చేశారు . వినాయక్ కు ఫిలిం నగర్ లోనే కాకుండా నగరం బయట కూడా పలు ఆస్తులు ఉన్నాయి అందులో నార్సింగ్ లో ఉన్న భవనం కూడా ఒకటి . అయితే అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాన్ని కూల్చివేశారు అధికారులు . ఒక్క వినాయక్ కు చెందిన భవనాన్ని మాత్రమే కాకుండా అక్కడ పలు కట్టడాలను కూల్చి వేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All