
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. రోటీన్ స్పోర్ట్స్ డ్రామగా ప్రేక్షకులు తేల్చేసారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.22 కోట్ల షేర్ మాత్రమే సాధించగా..రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోవడం మేకర్స్ ను భారీ షాక్ కు గురి చేసాయి. రెండవ రోజు ఏపి, తెలంగాణ లో కలుపుకొని కేవలం 72 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది.
రెండు రోజుల్లో 2 . 94కోట్ల షేర్, 5.35కోట్ల గ్రాస్ ను గని సాధించింది. కర్ణాటక ఓవర్సీస్ లో కలిపి 20 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 0.25కోట్లు రాబట్టిన గని ప్రపంచవ్యాప్తంగా 3.39 కోట్ల షేర్, 6 35కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. వీకెండ్ లోనే ఇలా ఉంటె..రేపటి నుండి కలెక్షన్లు లక్షల్లో కూడా వస్తాయో రావో అని భయపడుతున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.