Homeటాప్ స్టోరీస్మహానటి టీమ్ పై నిప్పులు చెరిగిన జెమిని గణేశన్ కూతురు

మహానటి టీమ్ పై నిప్పులు చెరిగిన జెమిని గణేశన్ కూతురు

gemini ganesan daughter kamala selvaraj fires on mahanati unitమహానటి చిత్రంలో మా నాన్న జెమిని గణేశన్ ని విలన్ గా చిత్రీకరించారని , చాలా సన్నివేశాల్లో అవమానించేలా చిత్రీకరించారని మహానటి చిత్ర బృందం పై నిప్పులు చెరుగుతోంది జెమిని గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ . మహానటి చిత్రం బాగుందని సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి , కొడుకు సతీష్ లు సంతృప్తి వ్యక్తం చేయగా జెమిని గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . మా నాన్న తమిళనాట తిరుగులేని స్టార్ హీరో అని అతడు సినిమాలు లేక ఖాళీగా ఉన్నట్లు కొన్ని సన్నివేశాల్లో చూపించారని అలాగే సావిత్రి ని బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చూపించారని అంటే మా అమ్మ ని ప్రేమించలేదా ? అసలు మొదట పెళ్లి చేసుకుంది మా అమ్మ నే ! అంటే మా అమ్మని ప్రేమించకుండానే పెళ్లి చేసుకున్నాడా ?

అలాగే సావిత్రి కి మద్యం అలవాటు చేసింది మా నాన్న అని చూపించారు అది తప్పు అలాగే ఆమెని సరిగ్గా చూసుకోలేదని కూడా చూపించారు అసలు విషయం మీకు ఏం తెలుసు ? ప్రాప్తం చిత్రం చేయొద్దని ఎంతగానో బ్రతిమిలాడాడని కానీ సావిత్రి అస్సలు వినలేదని పైగా మాపై కుక్క ని వదిలి మమ్మల్ని ఇంటి నుండి గెంటి వేయించారని ఆ సమయంలో నాన్న తో పాటుగా నేను కూడా ఉన్నానని కుక్క ని వదలడంతో మేము గోడ దూకి పారిపోయామని …… ఆ సంఘటన తర్వాత ఘోర అవమానంగా భావించిన మా నాన్న మళ్ళీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని స్పష్టం చేసింది కమలా సెల్వరాజ్ . అంతేకాదు మా నాన్న ఎవరినీ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఎవరైతే మా నాన్న ని ప్రేమించారో వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది కమలా సెల్వరాజ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All