
సూపర్ స్టార్ మహేష్-నమ్రత తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు నేడు (ఆగష్ట్ 31) ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బుర్రిపాలెం గ్రామానికి చెందిన 150 మంది పిల్లలకు విజయవాడ ఆంధ్ర హాస్పటల్ లో ఉచిత వైధ్యాన్ని అందించారు.
అనంతరం గౌతమ్ పుట్టినరోజు వేడుకలు భర్తీ కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం రిలీజ్ అయ్యాక ఎంతోమంది శ్రీమంతులు తమ గ్రామాలను దత్తత తీసుకొని ఆయా గ్రామాలను డెవలప్ చేస్తూ ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ ఆర్థిక సహాయం చేస్తున్నారు.
అలాగే సూపర్ స్టార్ మహేష్ కూడా తమ వంశీకుల జన్మస్థానం అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు అండగా నిలుస్తూ.. తన వంతు బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. కాగా మహేష్ తనయుడు గౌతమ్ పుట్టినరోజు సందర్బంగా బుర్రిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా నమ్రత తన ముద్దుల తనయుడు గౌతమ్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఐ లవ్ యు గౌతమ్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..!