Homeటాప్ స్టోరీస్ఘట్టనమనేని కుటుంబంలో మహేష్ బాబు మాత్రమే గట్టిగా రాణిస్తున్నారు...

ఘట్టనమనేని కుటుంబంలో మహేష్ బాబు మాత్రమే గట్టిగా రాణిస్తున్నారు…

Manjula Gattamaneni
Manjula Gattamaneni

తెలుగు సినిమా సూపర్ స్టార్ ‘ఘట్టమనేని కృష్ణ’ గారి కొడుకులుగా, కూతుళ్లుగా చాలా మంది అడుగుపెట్టారు. వారిలో ప్రిన్స్ సూపర్ స్టార్ ‘మహేష్ బాబు‘ గారికి మాత్రమే అరుదైన గౌరవం మరియు కృష్ణ గారి తర్వాత అంత పేరు దక్కింది. అన్నయ్య రమేష్ బాబు, అక్క మంజులకి తన వంతు కృషి చేసినా కూడా వారికి ఆ గౌరవం దక్కడం లేదు.

అన్నయ్య రమేష్ బాబు విషయానికి వస్తే హీరోగా 20 సినిమాలు మరియు నిర్మాతగా 05 సినిమాలని నిర్మించారు. అయినా కూడా తన కష్టానికి తగిన ఫలితం లేకుండా పోయింది. ఇక అక్క మంజుల విషయానికి వస్తే 05 సినిమాలని నిర్మించింది, 06 సినిమాలలో నటించింది, 01 సినిమాకి దర్శకురాలిగా చేసింది. గత సంవత్సరం విడుదల అయిన ‘మనసుకి నచ్చింది‘ సినిమాకి తమ్ముడు మహేష్ బాబు ని రంగం లోకి దింపి సినిమాకి తగిన ప్రమోషన్స్ చేపించింది.

- Advertisement -

సినిమాలో మహేష్ బాబు గొంతు కూడా విప్పడం జరిగింది. అక్క కోసం అన్ని చేసిన ఆ సినిమా ఘోర పరాజయం అయ్యింది. ఇప్పుడు నటిగా ఇంకొక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. నటి ‘హన్సిక’ తో కలిసి మంజుల నటిస్తున్న సినిమా ‘నషా’. ఈ వెబ్ సిరీస్ కి దర్శకులుగా ‘పిల్ల జమిందార్’ మరియు ‘భాగమతి’ సినిమాల దర్శకులు ‘అశోక్’. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ముంబయి లోని పలు లోకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నటులు అశుతోష్ రాణా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. 06 సంవత్సారాల తర్వాత నటిగా చేస్తున్న మంజుల గారు ఇక ముందు అయినా నటిగా తగిన ఆఫర్లు రావాలి అని ఘట్టమనేని అభిమానులు అనుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుందని అంటున్నారు దర్శకులు అశోక్ గారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All