
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఏప్రిల్ 02 న వైజాగ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటె ఈ చిత్ర నాన్ థియేట్రికల్ హక్కులను రూ. 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు వరుణ్ చేసిన చిత్రాలకు వచ్చిన వాటిలో ఇదే బెస్ట్ డీల్ అంటున్నారు.
మరి మొదటిసారి స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో వస్తున్న వరుణ్ కు ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో అలరిస్తుండగా.. ఈ సినిమాలో వరుణ్కు జోడీగా సయీ మంజ్రేకర్ నటించారు. జగపతి బాబు.. ఉపేంద్ర.. సునీల్ శెట్టి.. నవీన్ చంద్ర.. నదియా.. నరేశ్.. తనికేళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.తమన్ మ్యూజిక్ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో.. సిద్ధు ముద్ద- అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. సాయి కొర్రపాటి డైరెక్టర్.