
హీరో మూవీ తో ఇండస్ట్రీ లోకి హీరోగా పరిచమైన గల్లా అశోక్..సినిమా తో పెద్దగా క్రేజ్ రానప్పటికీ , తాజాగా జరిగిన పబ్ వ్యవహారం లో తన పేరు రావడం తో హీరోగా ఫుల్ క్రేజ్ వచ్చిందన్నారు అశోక్. శనివారం బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ ఫై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 150 మంది యువతీ , యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి , వారి వివరాలు తీసుకున్నారు. వీరిలో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారనేదానిపై విచారిస్తున్నారు. అయితే ఈ పబ్ లో దొరికిన వారిలో సినీ స్టార్స్ కూతుర్లు , కుమారులు ఉండడం మరింత ఆసక్తి రేపింది.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక , బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో పాటు గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ్ గల్లా కూడా ఉన్నాడు. అయితే ముందుగా గల్లా అశోక్ పేరు బయటకు రావడం తో అంత అతడి గురించి మాట్లాడుకోవడం చేసారు. ఈ వ్యవహారం లో అతడి పేరు రావడం పట్ల అశోక్ సంతోషం వ్యక్తం చేసాడు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సారు యాంకర్..రెండు రోజుల క్రితం పబ్ ఇష్యూలో మీపేరు బయటకు వచ్చింది. ఏమనిపించింది..? అని అడుగగా..
నేను ఆరోజు ఫిజియో థెరపీ చేయించుకుంటున్నాను. సడన్ గా వార్తల్లో నా పేరు ఎలా వచ్చిందో తెలీదు. అప్పుడు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెలబ్రిటీ లైఫ్ లో వుంటే ఇలానే వస్తుంటాయనిపించింది అని సమాధానం చెప్పాడు.