Homeటాప్ స్టోరీస్గాడ్ ఫాదర్ లో 'గద్దర్'..

గాడ్ ఫాదర్ లో ‘గద్దర్’..

gaddar in Godfather
gaddar in Godfather

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో గద్దర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా షూటింగ్ చ‌క చ‌కా జ‌ర‌గుతోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి తెర‌కెక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రజా గాయకుడు, చైతన్య గీతాల కళాకారుడు గద్దర్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన గద్దర్.. తన రోల్ తాలూకు వివరాలు వెల్లడించారు.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి జైలుకు వెళతారని.. ఆ జైలులో చిరంజీవికి తనకు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా తాను కనిపిస్తానని సీక్రెట్ రివీల్ చేశారు. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశానని, తనకు మంచి రెమ్మ్యూనరేషన్ కూడా ఇవ్వడం జరిగిందని గద్దర్ తెలిపారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All