Homeటాప్ స్టోరీస్ఆ చిత్రానికి ప్లాప్ టాక్

ఆ చిత్రానికి ప్లాప్ టాక్

Flop talk to sarabha film ఆకాష్ కుమార్ హీరోగా ఎన్ . నరసింహారావు దర్శకత్వంలో ఏ కేఎస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం శరభ . 20 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శరభ చిత్రం ఈరోజు విడుదలైంది . అయితే అనుకున్నట్లుగానే సినిమా తేలిపోయింది . కథ బాగున్నప్పటికీ కథనం అనుకున్న స్థాయిలో లేదు దాంతో ఈ సినిమా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . కొత్త హీరో , కొత్త దర్శకుడు , కొత్త నిర్మాణ సంస్థ కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . ఇక సినిమా మరీ ఆలస్యం కావడంతో కూడా శరభ ని పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో రిలీజ్ కార్యక్రమం మమ అనిపించారు .

గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రం అయినప్పటికీ , కొన్ని షాట్స్ బాగానే ఉన్నప్పటికీ బాహుబలి వచ్చిన తర్వాత మిగతా సినిమాలన్నీ విజువల్స్ పరంగా తేలిపోతున్నాయి . ఇందులో కూడా అదే జరిగింది . రక్తి కట్టించే అంశాలను దర్శకుడు ఎంచుకున్నాడు , కొన్ని సన్నివేశాలను బాగానే చేసాడు కానీ పూర్తిస్థాయిలో సరైన స్క్రీన్ ప్లే ని రాసుకోలేకపోయాడు . ఇక ఈ సినిమా పట్ల అంచనాలు లేకపోవడంతో ఓపెనింగ్స్ రాలేదు దాంతో భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది .

- Advertisement -

English Title: Flop talk to sarabha film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All