Homeటాప్ స్టోరీస్దెబ్బతిన్న నిఖిల్

దెబ్బతిన్న నిఖిల్

flop-talk-to-nikhils-kirrak-partyవిభిన్న కథా చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ కాగా నిన్న ఈ హీరో నటించిన కిరాక్ పార్టీ చిత్రం విడుదల అయ్యింది . కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం కాబట్టి తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంది లేకపోతే కనీసం హిట్ అయినా అవుతుందని అనుకున్నారు కానీ మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది కిరాక్ పార్టీ చిత్రానికి .

 

- Advertisement -

ఈ సినిమాకు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు దర్శకులు పనిచేసారు . శరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పరంగా నిఖిల్ స్నేహితులైన సుధీర్ వర్మ , చందు మొండేటి లు పనిచేసారు . సుధీర్ వర్మ , చందు మొండేటి లు కూడా దర్శకులు అన్న విషయం తెలిసిందే . ముగ్గురు దర్శకులు పనిచేసినప్పటికీ కిరాక్ పార్టీ ప్రేక్షకులకు నచ్చలేదు దాంతో ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది . ఎన్నో ఆశలతో రీమేక్ చేస్తే నిఖిల్ ని కిరాక్ పార్టీ పెద్ద దెబ్బ కొట్టింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All