Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ఓటమి ఖాయమని తేల్చిన తాజా సర్వే

కేసీఆర్ ఓటమి ఖాయమని తేల్చిన తాజా సర్వే

తెలంగాణ లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి షాక్ తగులుతోంది . న్యూ ఢిల్లీ కేంద్రంగా వ్యవహరించే సారాన్ష్ డేటా సొల్యూషన్స్ అనే సంస్థ తెలంగాణలో ప్రీ పోల్ సర్వే నిర్వహించింది . మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ గెలవబోతున్నారు , ఎంత ఓటు శాతం తెచ్చుకుంటున్నారు ? అని సవివరంగా ప్రీ పోల్ సర్వే తేల్చి పడేసింది . ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతోంది . టిఆర్ఎస్ పార్టీకి కేవలం 42 స్థానాలు మాత్రమే దక్కుతుండగా కాంగ్రెస్ – టిడిపి నేతృత్వంలోని ప్రజాకూటమి 66స్థానాల్లో గెలుపొందుతోంది . ఇక బిజెపి 5 , ఎం ఐ ఎం 6స్థానాల్లో గెలవబోతోంది .

ఇక ఈ సర్వే ఎప్పుడు చేశారో తెలుసా ……. 9 నవంబర్ నుండి 21 నవంబర్ వరకు చేసిన సర్వే ! అంటే తాజా సర్వే అన్నమాట ! ఈ సర్వే ప్రకారం కేసీఆర్ దారుణ ఓటమి ఖాయమైపోయింది . అయితే అసలు ఫలితాలు , ప్రజల తీర్పు మాత్రం డిసెంబర్ 11న వెలువడనుంది . డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ డిసెంబర్ 11 న రిజల్ట్ . కాంగ్రెస్ – టిడిపి కూటమి పై ముఖ్యంగా చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మరింత అసహనానికి గురి అవుతున్నాడు కేసీఆర్ . తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ – టిడిపి కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది .

- Advertisement -

English Title: FLASH ..FLASH … Latest Survey in Telangana Elections 2018

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All