Homeటాప్ స్టోరీస్రామారావు నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

రామారావు నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

First Single Bul Bul Tarang from Rama Rao On Duty out on 10th April
First Single Bul Bul Tarang from Rama Rao On Duty out on 10th April

మాస్ మహా రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో ఉన్నాడు. గత ఏడాది క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా ఖిలాడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ..ప్రేక్షకుల అంచనాలు అందుకోలేపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గించుకోకుండా తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి.

నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి మొదటి పాటగా ‘బుల్ బుల్ తరంగ్’​ను ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. రవితేజ, రజిషా విజయన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All