Homeటాప్ స్టోరీస్అద్వైతభూషణ్ లండన్ లో ఏం చేస్తున్నాడు.?

అద్వైతభూషణ్ లండన్ లో ఏం చేస్తున్నాడు.?

అద్వైతభూషణ్ లండన్ లో ఏం చేస్తున్నాడు.?
అద్వైతభూషణ్ లండన్ లో ఏం చేస్తున్నాడు.?

ఒక రాత్రి… ఒక కుటుంబం…. ఒక మెరుపు… ఒక మరణం… కాదు అది హత్య. అది తెలుసుకోడానికి పోలీసులు ఒక డిటెక్టివ్ ని కలుస్తారు. పేరు అద్వైత భూషణ్. కానీ అతను ఎందుకో.? అస్సలు పట్టించుకోడు. విసుగు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. లక్షల రూపాయలు ఫీజు తీసుకుని కేసులు సాల్వ్ చేసే ఆ డిటెక్టివ్ కోసం తను దాచుకున్న ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ తీసుకుని ఒక చిన్న పిల్లవాడు వస్తాడు. తన కుక్కపిల్ల కనపడటం లేదని… వెతికి పెట్టమనీ…. వెంటనే అద్వైత్ భూషణ్ కి ఎదో గుర్తొస్తుంది.

రంగంలోకి దిగాడు. టెక్నాలజీ ద్వారా మెరుపు తెప్పించి చేసిన హత్య నుండి మొదలుపెట్టి… ఒక చిన్న కుక్క పిల్ల మిస్సింగ్ కేసుతో మొదలుపెట్టి.. దేశవ్యాప్తంగా  పెద్ద పెద్ద హత్యలు చేసే ఒక పెద్ద హంతకుల ముఠాను పట్టుకుంటాడు. ఇక ఈ సినిమాలో హైలెట్ అంటే… డైరెక్టర్ మిస్కిన్ సార్ టేకింగ్, స్క్రీన్ ప్లే, కెమెరాను, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని సైతం క్యారెక్టర్ లుగా మార్చి మనల్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోపెడతాడు మిస్కిన్. ఇక ఈ సినిమాకు మరొక ప్రధాన బలం “ఇసైజ్ఞాని” ఇళయరాజా సర్ ఇచ్చిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

- Advertisement -

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా “తుప్పరివాలన్ 2” (డిటెక్టివ్ 2) సినిమా వస్తోంది. ఇందులో ఏకంగా “కనియన్ పూంగరనార్” అదే …. తెలుగులో అద్వైత భూషణ్ (సుప్రసిద్ధ తమిళ్ కవి) లండన్ లో ల్యాండ్ అయ్యి కొత్త కేసు సాల్వ్ చేస్తున్నాడు. మరి లండన్ లో ఏం జరిగింది.? లేదా ఇండియాలో ఇంకేమైనా జరిగిందా.?

అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. డైరెక్టర్ మిస్కిన్ బడ్జెట్ ఓవర్ ఫ్లో చేస్తున్నారనే కారణంతో విశాల్ స్వయంగా తనే మిగిలిన సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా లేట్ సమ్మర్ లో రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది.  క్రైమ్, సస్పెన్స్, డార్క్ కంటెంట్, థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All