Homeటాప్ స్టోరీస్“ఎస్.పి విక్రం రుద్రరాజు” గా విశ్వక్ సేన్

“ఎస్.పి విక్రం రుద్రరాజు” గా విశ్వక్ సేన్

“ఎస్.పి విక్రం రుద్రరాజు” గా విశ్వక్ సేన్
“ఎస్.పి విక్రం రుద్రరాజు” గా విశ్వక్ సేన్

“వెళ్ళిపోమాకే” అనే ఒక సినిమా ఉందని, అందులో హీరో విశ్వక్ సేన్ అనీ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను రిలీజ్ చేసారని మనలో చాలా మందికి తెలియదు. తరుణ్ భాస్కర్ తీసిన “ఈ నగరానికి ఏమైంది” సినిమాలో వివేక్ పాత్రతో ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. “ఫలక్ నామా దాస్” సినిమాతో టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు HIT అంటూ తన సరికొత్త చిత్రంతో మన ముందుకు వచ్చేసారు. మరొక టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో విశ్వక్ ఎస్.పి విక్రం రుద్రరాజు అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేసారు.

“ఒకసారి నీ జీవితంలో ఇలాంటి సంఘటనే జరిగినప్పుడు, నువ్వు ప్రేమించిన వ్యక్తి ని దూరం చేసుకున్నావ్.”; “ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది.! ఏం చేస్తావ్.?” అంటూ వచ్చిన డైలాగ్స్, విశ్వక్ నటన, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఇక స్వరసాగర్ వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి త్రిపిర్నేని ఈ సినిమా నిర్మాత. ఇక HIT సినిమా 28 ఫిబ్రవరి 2020 న రిలీజ్ అవుతుందని, త్వరలోనే టీజర్ విడుదల చేస్తామని, మూవీ టీం అప్ డేట్ ఇచ్చింది.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All