Homeటాప్ స్టోరీస్చిత్ర దర్శకుడు డాక్టర్ ఆనంద్ కు,ఢిల్లీ లో ప్రతిష్టాత్మకమైన తెలంగాణా అఛీవర్స్ అవార్డ్

చిత్ర దర్శకుడు డాక్టర్ ఆనంద్ కు,ఢిల్లీ లో ప్రతిష్టాత్మకమైన తెలంగాణా అఛీవర్స్ అవార్డ్

Film Dirtector ,Doctor gets Telangana Achievers Award​ సామాజిక కోణమే ప్రధానంగా లఘు చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న దర్శకుడు ఆనంద్‌ కుమార్‌కు మరో గౌరవం దక్కింది.వృత్తి రీత్యా డాక్టర్‌ అయిన ఆనంద్‌ సినీరంగం మీద ప్రేమతో దర్శకుడిగా మారారు. తన లఘు చిత్రాలతో సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో నిర్మాత యన్.యస్ నాయక్ ప్రోత్సాహంతో ఆనంద్‌ రూపొందించిన ప్రజాహక్కు, అంటురానితనం లాంటి షార్ట్‌ ఫిలింస్‌కు విమర్శకుల నుంచి ప‍్రశంసలు దక్కాయి. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన 9 ఏళ్ల అమ్మాయి చిరుతేజ్‌ సింగ్ కథతో తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిం ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.

జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించటంతో పాటు, పలు అవార్డు కమిటీల జ్యూరీలలో మెంబర్‌గా ఉన్న ఆనంద్‌కు తెలంగాణా ప్రభుత్వం తరుపున ,న్యూ ఢిల్లీ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణా విజేతల పురస్కారం మరియు సన్మానం దక్కాయి.ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, తాను తీసిన సామాజిక లఘు చిత్రాలైన ప్రజా హక్కు,అంటురానితనం,చిరుతేజ్ సింగ్ చిత్రాలను ,తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి ఇంతటి ప్రతిష్టాత్మకమైన తెలంగాణా అచీవర్స్ అవార్డ్ తో తనను సన్మానించినందుకు గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట చంద్రశేఖర్ రావ్ గారికి,తేజావత్ రామచంద్రు గారికి,తెలంగాణ ఢిల్లీ రెసిడెంట్ కమీషనర్ శ్రీ అశోక్ కుమార్ గారికి,ఇతర ఆఫీసర్స్ అందరికి,నిర్మాత యన్.యస్.నాయక్ గారికి,మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసారు.ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఎఎస్ అధికారి హిరాలాల్ సమారియా, ఇటీవల సివిల్ సర్వీస్ పరీక్షలలో టాపర్ గా నిలిచిన అనుదీప్ దురిశెట్టి, అధేవిధంగా ఈ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన సాయితేజ, శ్రీహర్ష, తెలంగాణ నుండి మహిళా పైలెట్ గా నిలిచిన బాబీని ఘనంగా సన్మానించారు.
ఈ ఏడాది జూలైలో జరగబోయే నాటా (నార్త్‌ అమెరికా తెలుగు అసోషియేషన్‌) మెగా కన్వెన్షన్‌లో దర్శకుడు ఆనంద్‌ కుమార్‌ పాల్గొనబోనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All