Homeటాప్ స్టోరీస్చిరంజీవి అతడి కుటుంబాన్ని ఆదుకుంటాడా ?

చిరంజీవి అతడి కుటుంబాన్ని ఆదుకుంటాడా ?

Fight master raju family wants financial help from chiranjeeviఫైట్ మాస్టర్ రాజు చనిపోయి 9 సంవత్సరాలు అవుతోంది . చిరంజీవి మెగాస్టార్ గా యాక్షన్ హీరోగా ఎదగడంలో ఫైట్ మాస్టర్ రాజు పాత్ర ఎంతో ఉంది . సీనియర్ హీరోల చిత్రాలన్నీ ఒక మూసలో వెళుతున్న సమయంలో తెలుగు సినిమాకు వేగాన్ని , యాక్షన్ ని జోడించిన హీరో చిరంజీవి . అయితే చిరంజీవి కి ఆ సమయంలో యాక్షన్ ఇమేజ్ రావడానికి ఫైట్ మాస్టర్ రాజు ఎంతగానో ఉపయోగపడ్డాడు . చిరంజీవి కూడా రాజు మాస్టర్ అంటే ఎనలేని గౌరవం ఇచ్చేవాడు .

కట్ చేస్తే …… ఫైట్ మాస్టర్ రాజు కుటుంబం ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతోంది . ఫిలిం ఇండస్ట్రీ నుండి కానీ ప్రభుత్వం కానీ మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఎదురు చూస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు . రాజు మాస్టర్ చనిపోయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ నుండి కానీ చిరంజీవి నుండి కానీ ఏమైనా ఆర్ధిక సహాయం అందుతుందని ఆశించిందట రాజు భార్య అనంత లక్ష్మి . కానీ చిరంజీవి నుండి కానీ ఇండస్ట్రీ నుండి కానీ ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది . మరి చిరంజీవి స్పందిస్తాడా ? ఫైట్ మాస్టర్ రాజు కుటుంబాన్ని ఆదుకుంటాడా ?

- Advertisement -

English Title: Fight master raju family wants financial help from chiranjeevi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All