Homeటాప్ స్టోరీస్ఊహ, వాస్తవాల అందమైన కలయికగా రాజరథం లోని 'నిన్ను నేను ప్రేమించానంటూ' పాట

ఊహ, వాస్తవాల అందమైన కలయికగా రాజరథం లోని ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ పాట

Fantasy & reality captured in Rajaratham's 'Ninnu Nenu Preminchanantu' Songఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాజరథం’ విడుదల దగ్గరయ్యే కొద్దీ చిత్ర బృందం మరో పాట ని విడుదల చేశారు. ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ అంటూ సాగే ఈ యుగళగీతం వినసొంపుగా ఉండడమే గాక, అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేయనుంది. బర్ఫీ, జగ్గా జాసూస్, వంటి చిత్రాలకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ ఆధ్వర్యంలో రూపొందబడిన ఈ పాటని ఊహ, వాస్తవాల కలయికగా ఒక భారీ సెట్ తో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఊటీ అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాట కోసం అడవుల్లోనే భారీ సెట్ నిర్మించారు. ఈ పాట కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రతిరోజూ ఎంతో శ్రమించి సెట్ ని నిర్మించేవారు. అటవీశాఖ వారి నియమాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత సెట్ ఉంచకూడదు. అందుకని రోజూ ఉదయం 3 గంటలకి సెట్ నిర్మాణం మొదలెట్టి సాయంత్రం 6 గంటలకి మళ్ళీ తీసేసేవారు.

 

- Advertisement -

చిత్ర సంగీత దర్శకుడు, దర్శకుడు అయిన అనూప్ 90 ల పాటల్లో ఉండే రొమాంటిక్ ఫ్లేవర్ తో ఈ పాట ఉండాలని అందుకోసం 40 మంది సంగీత నిపుణుల తో వయలిన్, సెల్లోస్ లతో కూడిన ఆర్కెస్ట్రా ని ఉపయోగించారు. ఇప్పటికి సరిపోయే పదాలతో రామజోగయ్య శాస్త్రి గారు పాటని రచించి పాటకి నిండుదనాన్ని తెచ్చారు. ఈ చిత్రంలో ని అన్ని పాటల ఆర్కెస్ట్రా కి ప్రముఖ సాక్స్ వాయిద్యకారుడు సాక్స్ రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. చాలా కాలం తర్వాత ఇంత మంచి మెలోడీలకి పనిచేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని స్వయంగా సాక్స్ రాజా చెప్పడం విశేషం.

ప్రముఖ నటుడు రవి శంకర్ ‘రాజరథం’ లో ‘చల్ చల్ గుర్రం’ అని సాగే పాటని పాడిన విషయం తెలిసిందే. ఆ పాట తో పాటు ఆయనకీ ఈ ”నిన్ను నేను ప్రేమించానంటూ’ అనే పాట ఎంతగానో నచ్చిందట. ఈ పాట గురించి చెప్తూ, ” నేను సినిమాకి సంబంధించి ఎన్నో పనులు చేయగలను కానీ ఈ ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ లాంటి పాటని మాత్రం స్వరపరచలేను. అనూప్ కి నిజంగానే ఆ సరస్వతి దేవి ఆశీస్సులున్నాయి”. పాట చిత్రీకరణ కోసం చిత్రబృందం చాలానే కష్టపడ్డారు. అంత చల్లటి వాతావరణంలో రైన్ సీక్వెన్స్ చిత్రీకరించాక హీరో నిరూప్ , హీరోయిన్ అవంతిక శెట్టి లు జ్వరం బారిన పడేవారు. ఎంతో అప్పీల్ ఉన్న ఈ పాట ని బాలీవుడ్ సింగర్ తో పాడించే అవకాశం ఉన్నా అనూప్ తానే ఈ ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ అంటూ సాగే పాటని పాడటం విశేషం.

 

టైటిల్ పాత్ర ‘రాజరథం’ గా రానా దగ్గుబాటి గాత్రంలో తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 23 న విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ ‘జాలీ హిట్స్’ సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All