Homeటాప్ స్టోరీస్బీస్ట్ సినిమా చూసిన వారికి లీటర్ పెట్రోల్ ఫ్రీ..

బీస్ట్ సినిమా చూసిన వారికి లీటర్ పెట్రోల్ ఫ్రీ..

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘బీస్ట్‌’. ఈ సినిమా కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలైంది. ఇక తమిళనాట మూవీ రిలీజ్ సందర్బంగా పెద్ద పండగ వాతావరణమే నెలకొంది.

- Advertisement -

చెన్నైలో విజయ్ దళపతి అభిమానులు బీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. చెన్నైలో బీస్ట్ సినిమా చూసిన వారికి లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించారు. విరుద్ నగర్ లోని రాజ్యలక్ష్మి, అమృత రాజ్ థియేటర్లలో బీస్ట్ ఎఫ్టీఎఫ్ఎస్ సినిమా కోసం టికెట్స్ తీసుకునే వారికి ఇదే తరహా ఆఫర్ ప్రకటించాయి. బీస్ట్ సినిమా కోసం 5 టికెట్స్ కొన్నవారికి లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమాకు డివైడ్ టాక్ నడుస్తుంది. సినిమా అభిమానుల అంచనాలు అందుకోవడంలో విఫలమైందని అంటున్నారు. ఇక అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఏకంగా సినిమా స్క్రీన్ కు నిప్పు పెట్టించి వారి కోపాన్ని చూపించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All