
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఎక్కడ చూసిన ఈ మూవీ మేనియానే కనిపిస్తుంది. తాజాగా ఓ అభిమాని ఏకంగా టీ కప్పులతో ఎన్టీఆర్ , చరణ్ లను రూపొందించి వార్తల్లో నిలిచాడు.
చిత్తూరు జిల్లాకు గుడుపల్లి మండలం చిన్నపర్తికుంటకు చెందిన పురుషోత్తం అనే యువకుడికి ఎప్పుడు వినూత్నంగా ఆలోచించడం అలవాటు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీలో నటించిన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను టీ కప్పులతో వేయాలని ఆలోచించాడు. దీంతో కష్టపడి ఆరు రోజులు శ్రమించి టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను రూపొందించి శభాష్ అనిపించాడు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని ఆర్ట్ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు.