
యావత్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ (రణం రౌద్రం రుధిరం) చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో గురువారం రాత్రి నుంచే ఓవర్సీస్ లో షోలు ప్రదర్శించారు. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేయగా.. సినిమాను చూసిన ఫ్యాన్స్ ను విశేష స్పందన లభిస్తోంది.
ఇదిలా ఉంటె ఆర్ఆర్ఆర్ థియేటర్ వద్ద ఓ అభిమాని గన్ తో హల్చల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా థియేటర్ లో RRR సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ థియేటర్ వద్ద దగ్గర ఓ అభిమాని గన్ తో హల్చల్ చేశాడు. ముందు సినిమా ధియేటర్ బయట గన్ తో ఫోజులిచ్చాడు. అక్కడితో ఆగకుండా, అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న సమయంలో సినిమా ధియేటర్ లోని తెరముందు గన్ తో తిరుగుతూ కెరింతలు కొట్టాడు. ఆ యువకుడి చేతిలో ఉన్న తుపాకీ నిజమైందా లేక డమ్మినా తెలియక అభిమానులు నివ్వెరబోయారు. ఆ యువకుడు పిఠాపురం చెందిన వ్యక్తి హసామిగా గుర్తించారు.