Homeటాప్ స్టోరీస్అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్

అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కోసం కలిసి పని చేశారు. వీరిద్దరు మరోసారి ఓ సినిమా కలిసి వర్క్ చేయనున్నారు.  అయితే ఈ సినిమాలో వీరు కలిసి నటించట్లేదు. ఒకప్పుడు చిన్నపిల్లను ఆకట్టుకున్న ‘అల్లాదిన్’ సినిమాను ఇపుడు అమెరికాకు చెందిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘అల్లాదిన్’ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది. ఈ  సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ గొంతులతో ‘అల్లాదిన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ సినిమా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All