Homeటాప్ స్టోరీస్ఎఫ్ 3 ఐదు రోజుల కలెక్షన్స్ మాములుగా లేవుగా..అంతేగా అంతేగా

ఎఫ్ 3 ఐదు రోజుల కలెక్షన్స్ మాములుగా లేవుగా..అంతేగా అంతేగా

f 3 movie 5 days collections
f 3 movie 5 days collections

2019 సంక్రాంతి కానుకగా ‘ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్)’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ విజయం సాధించడం వల్ల ఇప్పుడా మూవీకి సీక్వెల్ రూపొందించారు. ‘ఎఫ్ 3’ పేరిట తెరకెక్కిన ఈ చిత్రం మే 27 న థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. కథ పెద్దగా లేకపోయినప్పటికీ , కావాల్సినంత కామెడీ ఉండడం తో థియేటర్స్ కు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. దింతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది.

5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఎంత పెద్ద సినిమాకైనా వీక్ డేస్ లో డ్రాప్స్ అనేవి కామన్. ఈ చిత్రానికి సోమవారంతో పోల్చుకుంటే 35% డ్రాప్ కనిపించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 35.05 కోట్లు రాబట్టినట్లు నివేదికలు వస్తున్నాయి. యుఎస్ఏలో ఇప్పటికే 1 మిలియన్ మార్క్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ‘మేజర్’ – ‘విక్రమ్’ – ‘సుల్తాన్ పృథ్వీరాజ్’ వంటి మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతుండడం తో ఎఫ్ 3 కలెక్షన్లు డ్రాప్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisement -

ఇక ఎఫ్ 3 విషయానికి వస్తే..వెంకేటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో మెరిసింది. సునీల్ – వెన్నెల కిషోర్ – రాజేంద్ర ప్రసాద్ – మురళీ శర్మ – అలీ – రఘుబాబు – శ్రీకాంత్ అయ్యంగార్ – పృథ్వీరాజ్ – ప్రగతి – అన్నపూర్ణ – వై విజయ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All