Homeటాప్ స్టోరీస్మహేష్ టైటిల్ పై రచ్చ రచ్చ అవుతోంది

మహేష్ టైటిల్ పై రచ్చ రచ్చ అవుతోంది

Exciting discussion on mahesh babu 25th film టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మహేష్ బాబు కు ఇది 25 వ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు . ఇక ఈ చిత్రానికి ” రిషి ” అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ క్యారెక్టర్ పేరు రిషి అని తెలుస్తోంది . దాంతో సినిమా టైటిల్ కూడా ఇదే అయ్యుండొచ్చు అని అంటున్నారు .

దర్శకులు వంశీ పైడిపల్లి ” ఆర్ ఐ ఎస్ ” అనే అక్షరాలను సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఎవరికి వాళ్ళు రిషి అని డిసైడ్ చేస్తున్నారు . ఈనెల 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని టైటిల్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . లేదంటే టైటిల్ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ ఓన్లీ మహేష్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారట ఎందుకంటే సినిమా ఈ ఏడాది విడుదల కావడం లేదు వచ్చే ఏడాది ఏప్రిల్ లో కాబట్టి ఇప్పుడే టైటిల్ అనౌన్స్ ఎందుకు చేయడం అని అనుకుంటున్నారట . మొత్తానికి రిషి అనే టైటిల్ పట్ల రచ్చ రచ్చ అవుతోంది . ఇంతకీ టైటిల్ ఏంటి ? అన్నది రెండూ రోజుల్లో క్లారిటీ రానుంది .

- Advertisement -

English Title: exciting discussion on mahesh babu 25th film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All