Homeటాప్ స్టోరీస్రివ్యూ : సూర్య 'ఈటీ' - బోరింగ్ 'యాక్షన్'

రివ్యూ : సూర్య ‘ఈటీ’ – బోరింగ్ ‘యాక్షన్’

నటీనటులు : సూర్య , ప్రియాంక , సత్యరాజ్ తదితరులు
డైరెక్టర్ : పాండిరాజ్
మ్యూజిక్ డైరెక్టర్ : ఇమన్
టాలీవుడ్ రేటింగ్ : 2/5
విడుదల తేదీ : మార్చి 10 , 2022

రివ్యూ : సూర్య 'ఈటీ' - బోరింగ్ 'యాక్షన్'
రివ్యూ : సూర్య ‘ఈటీ’ – బోరింగ్ ‘యాక్షన్’

ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..ఇప్పుడు ఈటీ మూవీ తో ఈరోజు ( మార్చి 10 న ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయగా.. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కథ ఏంటి..? సూర్య యాక్టింగ్ ఎలా ఉంది..? సినిమాలో ప్లస్..మైనస్ లు ఏంటి..? అనేవి తెలుసుకుందాం.

- Advertisement -

కథ :

కృష్ణ మోహ‌న్ (సూర్య‌) లాయ‌ర్‌.. మహిళలు అంటే ఎంతో గౌరవం. వారికీ ఎలాంటి అన్యాయం జరిగిన ఉరుకునేవాడు కాదు. ఈ తరుణంలో సెంట్ర‌ల్ మినిష్ట‌ర్ కొడుకు అయిన కామేష్ (విన‌య్ రాయ్‌) .. అమ్మాయిల‌ను ర‌హస్యంగా వీడియో తీసి బెదిరిస్తుంటాడు. అలా ఓ రోజు కృష్ణ మోహన్ భార్య ఆదిర (ప్రియాంక అరుల్ మోహ‌న్‌) స్నేహితురాలును కూడా అలాగే బెదిరిస్తాడు. ఈ విషయం కృష్ణ మోహన్ కు తెలియడం తో ఆమెను కాపాడతాడు. కామేష్ గురించి తెలుసుకున్న కృష్ణ మోహన్..ఎలాగైనా అతడ్ని జైలు కు పంపించాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కామేష్ ..కృష్ణ మోహ‌న్‌పై ప‌గబ‌ట్టి అత‌న్ని స‌మ‌స్య‌ల్లో ప‌డేస్తాడు. కోర్టుకు వెళ్లినా లాభం ఉండ‌దు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? కామేష్ నుండి మహిళలను కృష్ణ మోహన్ ఎలా కాపాడతాడు..? అనేవి సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

* సూర్య యాక్టింగ్

* ప్రియాంక అరుల్ మోహ‌న్‌ గ్లామర్

* కథ

మైనస్ :

* హీరో – విలన్ ల మధ్య సాగదీత సన్నివేశాలు

* సూర్య – ప్రియాంక ల మధ్య లవ్ ట్రాక్

* సెకండ్ హాఫ్ బోరింగ్ సన్నివేశాలు

నటీనటుల తీరు :

* ఎప్పటిలాగానే సూర్య మరోసారి యాక్షన్ సన్నివేశాలను చించేసాడు. కథకు పూర్తి న్యాయం చేసాడు.

* ప్రియాంక గ్లామర్ పరంగానే కాక నటన పరంగా కూడా ఆకట్టుకుంది.

* హీరోకి తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. చనిపోయిన కూతురు కోసం తాపత్రయపడే ఓ సగటు తండ్రిలా ఆయన నటించిన విధానం ఎమోషనల్ గా ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక వర్గం ;

* రత్నవేలు తన సినిమాటోగ్రఫీ ద్వారా సన్నివేశాలను రిచ్‌గా చూపించారు.

* ఇమ్మామ్ సంగీతం అంత గొప్పగా ఏమిలేదు.

* రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి.

* దర్శకుడు పాండిరాజ్ మంచి స్టోరీ లైన్ తీసుకొని, దానికి ఆడపిల్లల జీవితంలో వచ్చే సమస్యలను మిక్స్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌.. వారి కుటుంబ స‌భ్య‌ల మ‌ధ్య ఉండే ఎమోష‌న్స్‌తో సినిమాను న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారు.

హీరో పెళ్లి సీన్‌లోని ట్విస్ట్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. అలాగే ఇంట‌ర్వెల్ ఫైట్ ఎమోష‌న‌ల్‌గా ఉంది. దాన్ని తెర‌కెక్కించిన తీరు కూడా చ‌క్క‌గా ఉంది. క్లైమాక్స్ ఫైట్, దాన్ని ముగించిన తీరు అంత ఎఫెక్టివ్‌గా లేదు. సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడికి సెకండాఫ్‌లో ఎలిమెంట్స్ డ్రాగింగ్‌గా అనిపిస్తాయి.

ఓవరాల్ గా ఈటీ ..యాక్షన్ కోరుకునే వారికీ బాగా నచ్చుతుంది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All