Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ లో ఈరోజు, రేపు ఎమోషన్స్ పీక్స్

బిగ్ బాస్ లో ఈరోజు, రేపు ఎమోషన్స్ పీక్స్

బిగ్ బాస్ లో ఈరోజు, రేపు ఎమోషన్స్ పీక్స్
బిగ్ బాస్ లో ఈరోజు, రేపు ఎమోషన్స్ పీక్స్

బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ ఎన్ని భాషల్లో వచ్చినా కూడా కొన్ని పాపులర్ టాస్క్స్ ను మార్చడానికి ఇష్టపడరు. అందులో ప్రధానమైంది హౌజ్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను ఇంట్లోకి పంపినప్పుడు హౌజ్ మేట్స్ ను ఫ్రీజ్ పేరిట నిలిపేసే టాస్క్. సాధారణంగా ఇలాంటి టాస్క్ ఆడుతున్నప్పుడు హౌజ్ మేట్స్ ను ఫ్రీజ్.. రిలీజ్ అంటూ బిగ్ బాస్ ఆడుకుంటాడు. సరిగ్గా ఫ్రీజ్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు రావడంతో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి.

బిగ్ బాస్ తొలి రెండు సీజన్లలో సూపర్ హిట్ అయిన ఈ టాస్క్ ఈరోజు, రేపు సీజన్ 3 లో ఆడనున్నారు. లాస్ట్ సీజన్ కు ఈసారి స్లీప్ అని మరో టాస్క్ ను యాడ్ చేసారు. స్లీప్ అని రాగానే అందరూ పడుకున్నట్లు నటించాలన్నమాట. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. ఈసారి అందరూ నామినేట్ అయిన విషయం తెల్సిందే.

- Advertisement -

ఇలా అందరూ నామినేట్ అయిన కారణంగా ఒత్తిడిలో ఉన్న హౌజ్ మేట్స్ కు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ రావడం నిజంగా బూస్టప్ ను ఇస్తుందని చెప్పవచ్చు. ఈరోజు కొంతమంది హౌజ్ మేట్స్, రేపు మరికొంత మంది హౌజ్ మేట్స్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు రానున్నారు. ఈరోజు ప్రోమోలో చూపించిన దాని ప్రకారం అలీ రెజా భార్య రానుంది. ఇంకా ఎవరెవరు వస్తారో, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All